Monday, March 9, 2020

మనిషి

రాపిడి లేనిదే
వజ్రం ప్రకాశించదు
అలాగే కష్టాలు లేనిదే
మనిషి పరిపూర్ణత చెందడు

Friday, December 27, 2019

జీవిత పాఠం..!

భయపడుతూ కూర్చుంటే
బతకలేవు
తప్పో, ఒప్పో అడుగు వేసి చూడు
గెలుపైతే - నిన్ను ముందుకు నడిపిస్తుంది.
ఓటమి పాలైతే - తర్వాత ఏం చేయాలో నేర్పిస్తుంది.

మట్టి..!

మట్టిని నమ్ముకుని
మట్టిలో కలసిపోయేవాడు ఒకడు.

మట్టిని అమ్ముకుని మేడ్లల్లో బతుకేవాడు ఇంకొకడు.

రెచ్చగోట్టకు..!!!

'రేపు' అనే నీ రాత ఏమిటో
తెలియనప్పుడు
'నేడు' అనే నీ సంతోషాన్ని
వదులుకోకు..!
గతాన్ని మరల తవ్వి నీ బాధని రెచ్చగోట్టకు..!

ఈ జీవితం

అదుపు తప్పి కిందపడితే
ఆదుకోదు ఈ లోకం.

అలసిపోయి కన్నుమూస్తే
బ్రతికించ లేదు ఏ బంధం.

దారిలోన చీకటైతే
తోడు రాదు నీ నీడ.

జారిపోయి దూరమైతే
చేరుకోదు నీ ప్రేమ.

అందుకే నిన్నే నమ్ముకో...
నువ్వయి సాగిపో...

నా ప్రియ నేస్తమా..! జాగ్రత్త సుమా..!

అద్భుతం

అవసరం అద్భుతాన్ని సృష్టిస్తుంది.

అంచనా...

ఒక మనిషిని అంచనా వేయాలంటే చూడాల్సింది వాడి ఆరంభాన్ని కాదు... ముగింపుని