Friday, December 27, 2019

జీవిత పాఠం..!

భయపడుతూ కూర్చుంటే
బతకలేవు
తప్పో, ఒప్పో అడుగు వేసి చూడు
గెలుపైతే - నిన్ను ముందుకు నడిపిస్తుంది.
ఓటమి పాలైతే - తర్వాత ఏం చేయాలో నేర్పిస్తుంది.

మట్టి..!

మట్టిని నమ్ముకుని
మట్టిలో కలసిపోయేవాడు ఒకడు.

మట్టిని అమ్ముకుని మేడ్లల్లో బతుకేవాడు ఇంకొకడు.

రెచ్చగోట్టకు..!!!

'రేపు' అనే నీ రాత ఏమిటో
తెలియనప్పుడు
'నేడు' అనే నీ సంతోషాన్ని
వదులుకోకు..!
గతాన్ని మరల తవ్వి నీ బాధని రెచ్చగోట్టకు..!

ఈ జీవితం

అదుపు తప్పి కిందపడితే
ఆదుకోదు ఈ లోకం.

అలసిపోయి కన్నుమూస్తే
బ్రతికించ లేదు ఏ బంధం.

దారిలోన చీకటైతే
తోడు రాదు నీ నీడ.

జారిపోయి దూరమైతే
చేరుకోదు నీ ప్రేమ.

అందుకే నిన్నే నమ్ముకో...
నువ్వయి సాగిపో...

నా ప్రియ నేస్తమా..! జాగ్రత్త సుమా..!

అద్భుతం

అవసరం అద్భుతాన్ని సృష్టిస్తుంది.

అంచనా...

ఒక మనిషిని అంచనా వేయాలంటే చూడాల్సింది వాడి ఆరంభాన్ని కాదు... ముగింపుని

శుభరాత్రి

రాత్రనేది కలలు కనే సమయం
కలత చెందాల్సిన సమయం కాదు
బాధైనా, బాధ్యతలైనా ప్రొద్దున్నే చూసుకోవచ్చు... హాయిగా నిదురపో...

మంచిమాట: విజయానికి పునాది.

ధీరుడు ఎప్పుడూ  తనకు కావలసినది స్వయంగా పోరాడి సాధించుకుంటాడు

ఒకరి నుండి అక్రమంగా  తీసుకోవాలనుకోడు.. ఏదీ ఉచితంగా అశించడు..
అతని పోరాటతత్వమే విజయానికి పునాది.

ప్రత్యేకత

అందరూ చేస్తున్నపని
నీవు చేస్తూ వుంటే
నీకు ప్రత్యేకత ఏమీ ఉండదు
ఇతరులు చేయలేని పని
నీవు చేయగలిగితేనే చరిత్ర సృష్టించగలవు

సంబాషణలు (జోక్స్)

రెండు గాడిదలు ఇలా మాట్లాడుకుంటున్నాయి
వాటి పేర్లు బంటి మరియు చంటి 

చంటి:   మా యాజమాని నన్ను పిచ్చాకొట్టుడు కొడుతున్నాడ్రా బంటి...!
బంటి: మరి ఎక్కడికైన పారిపోవచ్చు కదరా చంటి...!

చంటి: వాడి కూతురుకి మార్కులు తక్కువ వచ్చినప్పుడల్లా ఈ గాడిదకు ఇచ్చి పెళ్ళి చేస్తానని బెదిరిస్తాడు...
ఏదో ఓ నాడు ఈ ఇంటి అల్లుడ్ని కాకపోతానా అనే ఆశతో బ్రతుకుతున్నా...

ఆశపడడం

ఆశించి జీవించే వ్యక్తిలో నటన ఉంటుంది
ఆశించకుండా జీవించే వ్యక్తిలో ఆత్మీయత వుంటుంది.

విశ్వాసం

"విశ్వాసం" అనేది ఒక చిన్న పదం
దీనిని చదవడానికి ఒక సెకండ్ పడుతుంది
ఆలోచించడానికి ఒక నిమిషం పడుతుంది
అర్ధం చేసుకోవడానికి
ఒక రోజు పడుతుంది
నిరూపించుకోవడానికి మాత్రం
జీవితకాలం కావాలి"