Monday, October 22, 2012

నా ప్రేమకి నేనే విలన్

మెయిల్ చూసుకుందామని ఇంటర్ నెట్ సెంటర్ కెళ్ళా... పొరపాటున చాట్ తెరచుకుంది. 'హాయ్ హౌఆర్యూ?' అందో ఓ అమ్మాయి....


       వేళ్ళు చక చకా కదిలాయ్. కొద్ది నిమిషాలు చాటింగ్ లో పేరు, ఊరు చెప్పింది. మనసు మారాం చేస్తుంటే రెండు రోజులయ్యాక మళ్ళీ వెళ్ళా. ష్చ్...ఈ సారి అన్ లేన్ లో లేదు  మీతో చాటింగ్ చేయ్యాలనుంది .  ఎప్పుడు కలుద్దాం? అని సందేశం పంపా. జవాబోచ్చింది. ఈ సారి మూడు గంటలు చాటింగ్. మనసు విప్పింది. విచిత్రం... నా ఆలవాట్లు, ఆభిరుచులు జిరాక్స్ తీస్తే తను.

     నేను సూర్య. దిగువ మధ్యతరగతి కుటుంబం. పీజీ పూర్తి చేసి పార్ట్ టైం ఉద్యోగం చేస్తున్నా. లక్ష్యమేమో పెద్ద ఉద్యోగం. అందుకే సరదాలు, అమ్మాయిలకు దూరంగా ఉండేవాణ్ని. కానీ ఈమె విషయంలో నా  పట్టింపులు పక్కకెళ్ళాయి. చాటింగ్ పరిచయం సెల్ కు చేరువైంది. 'నాతో మాటాల్లడాంటే నువ్వే ఫోన్ చేయాలీ అని షరతులు పెట్టా. వేరే అమ్మాయి అయితే నవ్వుకునేదే!. కానీ కాదు. నా పరిస్థితి అర్దం చేసుకుంది.  ముందు వారానికోసారి, ఆ తరువాత వారంలో ఏడుసార్లు పలకరించేది. రోజు రోజుకు ఆమె పై అభిమానం పెరుగుతుండేది. దానికి అడ్డుకట్ట వేస్తూ నాకో షాకింగ్ న్యూస్ తనకు ఇంతకు ముందే పెళ్ళి కుదిరిందంట.  ఆలోచనలో పడ్డా. మాట్లాడాలా? వద్ధా? తట పటాయించా. చివరికి 'మంచి ప్రెండ్స్ లా ఉందాం' అనుకున్నాం ఇద్దరం.

       కబుర్లు జోరందకున్నాయి. దాంతో పాటు తను దూరమువుతుందనే బాధకూడా. ఈ పరిస్థితులో నాకు పెద్ద ఊరట కోరుకున్న కోలువు దక్కడం. అంతకుముందు తనతో ఎప్పుడూ అనేవాణ్ని. 'నాకు ఉద్యోగమొస్తే నిన్ను నేరుగా కలుస్తా. మంచి బహుమతి ఇస్తా' అని. ఆ మాట వెంటనే నిజం చేస్తే పరిస్థితులు వేరేలా ఉండేవేమో!.

      'ఈ రోజే ముహార్తం పెట్టుకున్నాం. మూడునెలల్లో పెళ్ళీ అంది. నా కొలువు మాట  తన చేవి చేరకముందే. నా సంతోషం ఆవిరి అయింది. తోంబై రోజులు నరకంలా అనిపించింది. ' నాధీ నీ పరిస్థితే సూర్యా!' అని తను ఒక్కమాట అనుంటే కచ్చితంగా  దైర్యం చేసేవాణ్ని! తనూ నాలాగే భాధని పంటి బిగువున భరించిది.




       ఆ రోజు నాకిప్పటికి గురై. పెళ్ళికి ముందు రోజు ఏడుస్తూ ఫోన్ చేసింది. 'నువుంటే నాకు ప్రాణం సూర్యా! నేను నిన్ను వదులుకోలేను రా' అని. కన్నీళ్ళాగ లేదు నాకు. నేను ' ఊ అంటే తను నాతో వచ్చేయడానికి సిద్దం.  మంచి ఉద్యోగం ఉంది. అమ్మ నాన్నల్నీ ఒప్పించగలను. కానీ ఇంతదాకా వచ్చి కూతురి పెళ్ళి ఆగితే ఆ తల్లిదండ్రుల పరిస్థితేంటి ? పరువు మర్యాదలేం కావాలి ? రక రకాల ఆలోచనలతో బుర్ర వేడేక్కింది. చివరికి 'కుటుంబం అనుబందాలే శాశ్వతం' అన్న నా మనసు మాటకే ఓటేశా. 'మీ అమ్మా నాన్నలు చూసిన అబ్బాయినే పెళ్ళి చేసుకో' అని సలహా ఇచ్చా . ఆ మాటాలు చెబుతుంటే పదునైన ఈటెలు నా గుండెని గుచ్చుతున్న భాధ !. కానీ తనమో మరోల భావించింది. నువ్వు చేతకాని వాడివంది. పిరికివాడివాని తిట్టింది. తర్వాత ఆ గొంతు నాకు మళ్ళీ వినపడునేలేదు.

       ఆరేళ్ళ కిందటి అనుభవమిది. ఈ మధ్యే తనని ఓ సామాజిక అనుబంధాల వెబ్ సైట్ లో చూశా. విశేషం ఏమిటంటే తన రూపాన్ని చూడ్డం అదే మొదటిసారి. కుందనపు బొమ్మలా ఉంది. ఆ గోంతుకు ఈ రూపాన్ని జత చేసి  ఒక్కో కబురుని గుర్తు తెచుకున్నా 'తను నా సోంతమైతే ఎంత బాగుండేంది ?' అనిపించింది క్షణకాలం. కానీ నా చేతుల్లో ఏం లేదుగా ! చివరుగా తనతో ఒక మాట !


   నేను నీకు గుర్తుంటే దయచేసి క్షమించు...    
  మరిచిపోతే జీవితాంతం సుఖంగా ఉండు...