Saturday, July 5, 2014

నీ జ్ఞాపకం చెరపటం నా వల్ల కాదు...


నా వల్ల కాదు
నీ జ్ఞాపకం చెరపటం నా వల్ల కాదు
నిను మరవడానికి చేసే ప్రతి ప్రయత్నం లో
మరో జ్ఞాపకమైపొతున్నావు
దూరమవుతున్నాననుకుంటూ
మరింత దగ్గరైపోతున్నాను.
జ్ఞాపకాలు చెరిపేస్తున్నాననుకుంటూ
ప్రతి ఆలోచనలో నిను పొందుపరిచేస్తున్నాను
ఇప్పటికి అర్దమయింది
నేను వదులుకుందామనుకుంటుంది
నీ జ్ఞాపకాన్నే గానీ
నిన్ను కాదు అని......!!

Friday, June 20, 2014

నీ ప్రేమ నాకే అనుకున్నాను...

నువు నాకోస౦ ఇ౦త తపన పడ్తు౦టే
నీ ప్రేమ నాకే అనుకున్నాను
నాకోస౦ క౦టతడి పెడ్తు౦టే
నా జీవిత౦ నీకే అనుకున్నాను
అన్ని వొదిలేసి నీకోస౦ వస్తే నువ్వు నాకు
మిగిల్చి౦దేమిటి నను ఒ౦టరిని చేసి
నీ ధారి నువ్వు చూస్కున్నావు
నన్ను ప్రేమిస్తున్నావన్కున్నానే కాని
ప్రేమిస్తున్నట్టు నమ్మి౦చాటానికే నటిస్తున్నావని ఏనాడు అనుకోలేదు....

Thursday, June 12, 2014

అంతులేని ప్రేమ ...

నీవే నాలోకం , నీవే నా ప్రాణం ,
నా హృదయం నిండా నీవై ఉన్నావని ,
నేనెంత విర్ర వీగినా ,......
నా కనులు గాంచని నీవు నాపై చూపించే,
అంతులేని ప్రేమ ముందు నేనెప్పుడూ
ఓడిపోతూనే వుంటాను నేస్తం ....

ప్రేమ జ్యోతులు వెలిగిస్తావనుకున్నాను...

నా హృదయాన్ని మమతానురాగాల కోవెల చేసి,
ప్రేమ జ్యోతులు వెలిగిస్తావనుకున్నాను...

కానీ...!

మమతాను రాగాలను మసి చేసి,
ప్రాణం లేని జీవచ్చవాలు కలియతిరిగే
స్మశాన వాటికను చేసి చితి మంటలను రగిలిస్తావని, కలలోనైనా కలగనలేదు..

నిజ౦ చెప్పి౦ది....

నన్ను చేరువయ్యే మరణ౦ చేదు నిజ౦
చెప్పి౦ది
మరుజన్మలోనైన మగువ మాయలో
పడకు అని..

Sunday, June 8, 2014

ఏ మందు మాన్పగలదు..!

నువ్వు మిగిల్చిన జ్ఞాపకాలు,
ఒక్కో ముల్లై గుండెను గుచ్చి గాయం చేస్తుంటే...!
నా మనసు పడే నరకయాతనను ఏ మందు మాన్పగలదు..!
నీ ప్రేమ తప్ప...

Sunday, March 23, 2014

ప్రేమ....

ప్రేమ పుట్టేది క్షణ కాలం....
కాని
నిలుపుకోవాల్సింది మాత్రం జీవిత కాలం...    

వృధాశ్రమం లో ఉన్న ఒక ఆమ్మ ప్రశ్న...??

" నిన్ను తొమ్మిది నెలలు
కడుపు లో పెట్టుకుని మోసిన
నాకు ఉండటానికి కొంచం   
స్థలం లేదా నీ ఇంటిలో ?"       

మరణం...

నేను వెళుతున్నానుని భాధపడకు
చావు నా దేహానికేగాని.....
నీ మనసులో ఉన్న నా ప్రేమకు మరణం లేదు..! 

మనిషిగా...

ఎదుటివారి కన్నీరు చూసి
నువ్వు ఆనందించాలి
అనుకుంటే,
ఆ క్షణమే నువ్వు మనిషిగా
మరణించినట్టు లెక్క...