Tuesday, September 4, 2012

ప్రకృతి సత్యాలు

ఒక ఆకు రాలుతూ చెప్పింది
ఈ జీవితం శాశ్వతం కాదని...

ఒక పువ్వు వికసిస్తూ చెప్పింది
జీవించేది ఒక్కరోజైన గౌరవంగా జీవించమని... 

ఒక మేఘం వర్షిస్తూ చెప్పింది
చేదును గ్రహిస్తూ మంచిని పంచమని...

ఒక మెరుపు మెరుస్తూ చెప్పింది
ఉండేది ఒక్క క్షణమైనా ఉజ్వలంగా ఉండమని...

ఒక కొవ్వొత్తి కరిగిపోతూ చెప్పింది
చివరి క్షణం వరకు పరులుకు సాయపడమని...

ఒక వృక్షం చల్లగా చెప్పింది
తను కష్టాల్లోవున్నా ఇతరులకు సుఖాన్ని ఇవ్వమని...

ఒక ఏరు జలజలా పారుతూ చెప్పింది
తనలాగే కష్టసుఖాల్లో చలించకుండా సాగమని...

జాబిల్లి వెలుగుతూ చెప్పింది
తనలాగే ఎదుటి వారిలో వేలుగు నింపమని...

చిన్ని ప్రేమ....

ఒరేయ్...
దానికి ఇంకా నేను లేను వేయలేనురా, ఇప్పటికే దానికి చాలా మంది లేను వేస్తునారు...
పిచ్చోడా, అందంగా ఉన్న అమ్మాయిలు, రష్ గా ఉన్న బస్సు లాంటోల్లు రా, ఫూట్ట్ బోర్డ్ దగ్గర రష్ గానై ఉంటుంది, ఒక్కసారి లోపలికి వెళ్ళ్తే విశాలంగా ఉంటుంది  

పగిలితే...

వస్తువు పగిలితే శబ్దం వస్తుంది....
మనసు పగిలితే నిశ్సబ్దం వస్తుంది...

ప్రేమ...

ఒరేయ్...
ప్రేమ అనేది ప్రియ పచ్చడిలాంటిది..
దూరం నుంచి ఊరిస్తుంది....
దగ్గరికి వెళ్లితే కవ్విస్తుంది ...
నచ్చింది కదా అని నోట్లో వేస్తే మండుతుంది
కారం కళ్లోలోంచి కారుతుంది....

జీవితం.


తొలి శ్వాస తీసుకుని ఏడుస్తావు....
తుది శ్వాస విడిస్తూ ఏడుపిస్తావు....
రెండు ఏడుపుల మధ్య
నవ్వుతూ... నవ్వించిన కాలమే
జీవితం.