Wednesday, November 21, 2012

ప్రపంచం

ఉన్నతంగా ఎదగాడనికి మీకు ప్రపంచం కావాలి
ఎదిగిన తరువాత ప్రపంచానికి మీరు కావాలి
అందుకే ప్రపంచం మీకోసం ఎదురు చూసేలా మీరు ఎదగాలి !

బాధలో చిరునవ్వు

ప్రతి హృదయానికీ ఒక బాధ అంటూ ఉంటుంది. కానీ దాన్ని బయటికి వ్యక్తం  చేసే తిరులోనే వైవిధ్యాని ప్రదర్శిస్తారు. పిచ్చివాళ్లు కళ్లలో దాచుకుంటే, తేలివైన వారు వారి చిరునవ్వులో దాస్తారు    

Tuesday, November 20, 2012

నా సర్వసం నీవే . . .

నీవే నా అంతం . . .
నీవే నా అంత రాత్మ . . .
నీవే నా పరమాత్మ . . .
నీవే నా మరోజన్మాత్మ . . . !           

అమ్మాయి

సముద్రాన్ని చూస్తే అలలు . . .
అమ్మాయి  చూస్తే కలలే మిగులుతాయి . . . .    
       

ఓర్పు

ఓర్పు అనేది ఎంత చేదుగా ఉంటుందో దాని వల్ల లభించే ప్రతిఫలం అంత తీయగా ఉంటుంది    

Monday, October 22, 2012

నా ప్రేమకి నేనే విలన్

మెయిల్ చూసుకుందామని ఇంటర్ నెట్ సెంటర్ కెళ్ళా... పొరపాటున చాట్ తెరచుకుంది. 'హాయ్ హౌఆర్యూ?' అందో ఓ అమ్మాయి....


       వేళ్ళు చక చకా కదిలాయ్. కొద్ది నిమిషాలు చాటింగ్ లో పేరు, ఊరు చెప్పింది. మనసు మారాం చేస్తుంటే రెండు రోజులయ్యాక మళ్ళీ వెళ్ళా. ష్చ్...ఈ సారి అన్ లేన్ లో లేదు  మీతో చాటింగ్ చేయ్యాలనుంది .  ఎప్పుడు కలుద్దాం? అని సందేశం పంపా. జవాబోచ్చింది. ఈ సారి మూడు గంటలు చాటింగ్. మనసు విప్పింది. విచిత్రం... నా ఆలవాట్లు, ఆభిరుచులు జిరాక్స్ తీస్తే తను.

     నేను సూర్య. దిగువ మధ్యతరగతి కుటుంబం. పీజీ పూర్తి చేసి పార్ట్ టైం ఉద్యోగం చేస్తున్నా. లక్ష్యమేమో పెద్ద ఉద్యోగం. అందుకే సరదాలు, అమ్మాయిలకు దూరంగా ఉండేవాణ్ని. కానీ ఈమె విషయంలో నా  పట్టింపులు పక్కకెళ్ళాయి. చాటింగ్ పరిచయం సెల్ కు చేరువైంది. 'నాతో మాటాల్లడాంటే నువ్వే ఫోన్ చేయాలీ అని షరతులు పెట్టా. వేరే అమ్మాయి అయితే నవ్వుకునేదే!. కానీ కాదు. నా పరిస్థితి అర్దం చేసుకుంది.  ముందు వారానికోసారి, ఆ తరువాత వారంలో ఏడుసార్లు పలకరించేది. రోజు రోజుకు ఆమె పై అభిమానం పెరుగుతుండేది. దానికి అడ్డుకట్ట వేస్తూ నాకో షాకింగ్ న్యూస్ తనకు ఇంతకు ముందే పెళ్ళి కుదిరిందంట.  ఆలోచనలో పడ్డా. మాట్లాడాలా? వద్ధా? తట పటాయించా. చివరికి 'మంచి ప్రెండ్స్ లా ఉందాం' అనుకున్నాం ఇద్దరం.

       కబుర్లు జోరందకున్నాయి. దాంతో పాటు తను దూరమువుతుందనే బాధకూడా. ఈ పరిస్థితులో నాకు పెద్ద ఊరట కోరుకున్న కోలువు దక్కడం. అంతకుముందు తనతో ఎప్పుడూ అనేవాణ్ని. 'నాకు ఉద్యోగమొస్తే నిన్ను నేరుగా కలుస్తా. మంచి బహుమతి ఇస్తా' అని. ఆ మాట వెంటనే నిజం చేస్తే పరిస్థితులు వేరేలా ఉండేవేమో!.

      'ఈ రోజే ముహార్తం పెట్టుకున్నాం. మూడునెలల్లో పెళ్ళీ అంది. నా కొలువు మాట  తన చేవి చేరకముందే. నా సంతోషం ఆవిరి అయింది. తోంబై రోజులు నరకంలా అనిపించింది. ' నాధీ నీ పరిస్థితే సూర్యా!' అని తను ఒక్కమాట అనుంటే కచ్చితంగా  దైర్యం చేసేవాణ్ని! తనూ నాలాగే భాధని పంటి బిగువున భరించిది.




       ఆ రోజు నాకిప్పటికి గురై. పెళ్ళికి ముందు రోజు ఏడుస్తూ ఫోన్ చేసింది. 'నువుంటే నాకు ప్రాణం సూర్యా! నేను నిన్ను వదులుకోలేను రా' అని. కన్నీళ్ళాగ లేదు నాకు. నేను ' ఊ అంటే తను నాతో వచ్చేయడానికి సిద్దం.  మంచి ఉద్యోగం ఉంది. అమ్మ నాన్నల్నీ ఒప్పించగలను. కానీ ఇంతదాకా వచ్చి కూతురి పెళ్ళి ఆగితే ఆ తల్లిదండ్రుల పరిస్థితేంటి ? పరువు మర్యాదలేం కావాలి ? రక రకాల ఆలోచనలతో బుర్ర వేడేక్కింది. చివరికి 'కుటుంబం అనుబందాలే శాశ్వతం' అన్న నా మనసు మాటకే ఓటేశా. 'మీ అమ్మా నాన్నలు చూసిన అబ్బాయినే పెళ్ళి చేసుకో' అని సలహా ఇచ్చా . ఆ మాటాలు చెబుతుంటే పదునైన ఈటెలు నా గుండెని గుచ్చుతున్న భాధ !. కానీ తనమో మరోల భావించింది. నువ్వు చేతకాని వాడివంది. పిరికివాడివాని తిట్టింది. తర్వాత ఆ గొంతు నాకు మళ్ళీ వినపడునేలేదు.

       ఆరేళ్ళ కిందటి అనుభవమిది. ఈ మధ్యే తనని ఓ సామాజిక అనుబంధాల వెబ్ సైట్ లో చూశా. విశేషం ఏమిటంటే తన రూపాన్ని చూడ్డం అదే మొదటిసారి. కుందనపు బొమ్మలా ఉంది. ఆ గోంతుకు ఈ రూపాన్ని జత చేసి  ఒక్కో కబురుని గుర్తు తెచుకున్నా 'తను నా సోంతమైతే ఎంత బాగుండేంది ?' అనిపించింది క్షణకాలం. కానీ నా చేతుల్లో ఏం లేదుగా ! చివరుగా తనతో ఒక మాట !


   నేను నీకు గుర్తుంటే దయచేసి క్షమించు...    
  మరిచిపోతే జీవితాంతం సుఖంగా ఉండు...   

 




Tuesday, September 4, 2012

ప్రకృతి సత్యాలు

ఒక ఆకు రాలుతూ చెప్పింది
ఈ జీవితం శాశ్వతం కాదని...

ఒక పువ్వు వికసిస్తూ చెప్పింది
జీవించేది ఒక్కరోజైన గౌరవంగా జీవించమని... 

ఒక మేఘం వర్షిస్తూ చెప్పింది
చేదును గ్రహిస్తూ మంచిని పంచమని...

ఒక మెరుపు మెరుస్తూ చెప్పింది
ఉండేది ఒక్క క్షణమైనా ఉజ్వలంగా ఉండమని...

ఒక కొవ్వొత్తి కరిగిపోతూ చెప్పింది
చివరి క్షణం వరకు పరులుకు సాయపడమని...

ఒక వృక్షం చల్లగా చెప్పింది
తను కష్టాల్లోవున్నా ఇతరులకు సుఖాన్ని ఇవ్వమని...

ఒక ఏరు జలజలా పారుతూ చెప్పింది
తనలాగే కష్టసుఖాల్లో చలించకుండా సాగమని...

జాబిల్లి వెలుగుతూ చెప్పింది
తనలాగే ఎదుటి వారిలో వేలుగు నింపమని...

చిన్ని ప్రేమ....

ఒరేయ్...
దానికి ఇంకా నేను లేను వేయలేనురా, ఇప్పటికే దానికి చాలా మంది లేను వేస్తునారు...
పిచ్చోడా, అందంగా ఉన్న అమ్మాయిలు, రష్ గా ఉన్న బస్సు లాంటోల్లు రా, ఫూట్ట్ బోర్డ్ దగ్గర రష్ గానై ఉంటుంది, ఒక్కసారి లోపలికి వెళ్ళ్తే విశాలంగా ఉంటుంది  

పగిలితే...

వస్తువు పగిలితే శబ్దం వస్తుంది....
మనసు పగిలితే నిశ్సబ్దం వస్తుంది...

ప్రేమ...

ఒరేయ్...
ప్రేమ అనేది ప్రియ పచ్చడిలాంటిది..
దూరం నుంచి ఊరిస్తుంది....
దగ్గరికి వెళ్లితే కవ్విస్తుంది ...
నచ్చింది కదా అని నోట్లో వేస్తే మండుతుంది
కారం కళ్లోలోంచి కారుతుంది....

జీవితం.


తొలి శ్వాస తీసుకుని ఏడుస్తావు....
తుది శ్వాస విడిస్తూ ఏడుపిస్తావు....
రెండు ఏడుపుల మధ్య
నవ్వుతూ... నవ్వించిన కాలమే
జీవితం. 

Thursday, August 23, 2012

అమ్మ...

అమ్మ...
     నాకు మాటలు నేర్పమంటే  
     తనూ కూడా నాలానే మాట్లాడుతుంది
     
అమ్మ...
     నేను పలికే కొత్త కొత్త మాటలికి
     అర్దాలు చేప్పే నిఘంటువు  

అమ్మ...
     చందమామ రాదు అని తెలిసిన 
     చందమామ రావే... అని నాకోసం పిలుస్తుంది

అమ్మ...
    నా రేపటి  భవిష్యత్త్ కోసం  శ్రమించే నిత్య  శ్రామికురాలు... 

అమ్మో... పిల్లి కాదు... ఫులి


అమ్మ ...

జన్మ ఇచ్చిన నీకు
జన్మంతా ఋణపడి ఉంటానమ్మా...

Monday, July 30, 2012

ప్రేమలో ఒడిన ఓ భఘ్న ప్రేమికుడి సందేశం ...

అబ్బాయి చాలా తొందరగా ప్రేమలో పడతారు
మరిచిపోడనికే జీవితకాలం సరిపొదు వాళ్ళకు

అమ్మాయిలు అలస్యంగా ప్రేమిస్తారు
అదేంటో క్షణాలో ప్రేమించిన వాడిని  మరిచిపొయి
పెళ్లికి రెడీ అవుతారు

అదేంటి  అని అడిగితే  వాడి  ప్రవర్తన నచ్చలేదు 
వాడి మనస్తత్వం నచ్చలేదు 
అసలు వాడు  మంచోడే కాదు అని మాట మారుస్తారు...

ప్రేమలో ఉన్నపుడు నా బంగారం   
నా కన్న,  నా బుజ్జి, నువ్వు లేకుండా 
నిన్ను చూడకుండా ఉండలేను రా...
అంటారు కదా !  మరి అంతలోనే
బంగారం ఇత్తడి అవుతుంది ఏంటో...

చూడకుండా ఉండలేను  అన్న వాళ్ళే  
చూడకుండా  ముఖం దాచుకోవడం
ఎందుకో అర్ధం కావట్లే...      
ఇష్టం లేకపోతే వద్దు నువ్వు  నచ్చలేదు...  
వేరేవాన్ని   చూసుకుంటా  అని సుటిగా చెప్పలేక....
మా అయ్యా వోప్పుకోడు         
మా అమ్మ తట్టుకొలేదు అని సొల్లుచేప్పడం దయ్యచేసి  మానుకోండి. 

Friday, May 4, 2012


జీవితములో అందమైన, మరిచిపోలేని మధుర క్షణాలు ఎన్నడు తిరిగి రావు..

కాని ప్రియమైన వారి సహచర్యం మరియు వారు తాలుకు జ్ఞాపకాలు, మదుర స్మ్రుతులు.. మీ హుదయాన ఎప్పటికి నిలిచి పోతాయి...      
   


నా తల్లికి కొడుకు

నా ప్రేమ విఫలమైతే, ప్రేయసి కోసం నేను చనిపోను.
ఎందుకంటే తనకు ఇంకో ప్రేమికుడు దోరికే ఆవకాశం ఉంది.


కాని నా తల్లికి కొడుకు ఏప్పటికి దొరకడు.. 


నీ చుట్టూ కటిక చీకటి
అనుక్షణం స్పందించే గోడలు
ప్రవహిస్తున్న ఎర్రని రక్తం ఉందని
ఏ మాత్రం భయపడవద్దు
నీవు సురిక్షితమైన ప్రదేశంలోనే ఉన్నావు...


అది నా Heart...

ఈ చిరుగాలి నీకు జోల పాడుతు ఉంటే...
వాలి పోయే నీ కనురెప్పల మాటున,
కోటి కలలు ఉదయించాలని,
నీ ప్రతి కల నిజం కావాలని
ఆశిస్తూ...
 శుభరాత్రి

           
            శుభరాత్రి


పరీక్ష పాస్ అయితే........

  ఆమ్మ : 'అంతా దేవుడు దయ'
  నాన్న : 'నువ్వు నా కోడుకు వి రా'
  ఫ్రేయసి : 'ఐ లవ్ యు రా'
  స్నేహితులు : 'మామా రారా బారు కి వెళదాం'

పరీక్ష పేయిలు   అయితే...
ఆమ్మ: 'ఎంతసేపు టివి, మొబైలే కదా'
నాన్న: 'అమ్మాయిలు వెనుక తిరగడమే సరిపోయింది '
ప్రేయసి : 'Stupid నీకు ఒక Target అంటూ ఉంటే కదా'
స్నేహితులు: 'మామా రారా బారు కి వెళదాం'


    స్నేహితులు ఎప్పటికి మారారు...    

Wednesday, April 18, 2012

ఫ్రేమను ఫ్రేమతో ఫ్రేమగా ఫ్రేమిస్తే....


ఫ్రేమను ఫ్రేమతో ఫ్రేమగా ఫ్రేమిస్తే
ఫ్రేమించ బడిన ఫ్రేమ
ఫ్రేమించిన ఫ్రేమను
ఫ్రేమతో ఫ్రేమిస్తుంధి

నిద్రరాక నిరీక్షిస్తూ..


నీవు చేంతన ఉంటే సునామిలో సఖంగా నిద్రపోతా ...
నీవు లేకుంటే పులపనుపునైన ముల్లపనుపుగా భావిస్తా ...
నిద్రరాక నిరీక్షిస్తా ..
నీవు వస్తానంటే చాలు ...
ఆ తలంపుతోనే జీవితమంతా నీకు అర్పిస్తా.. ఎదురుచూస్తా...

స్నేహం...


మాటలతో పుట్టి, చూపులతో మొదలయ్యేది కాదు స్నేహమంటే
మనసులో పుట్టి మట్టీలో కలిసేంతవరకు తోడుగా ఉండేదే స్నేహం...!!

మధురాష్టకం


ఫ్రేమ సఫలమైతే మంచి కాపురమౌతుంది.
విఫలమైతే మధుర కావ్యమౌతుంది.
ఫ్రపంచ సాహిత్యంలో ప్రేమ కథలన్నీ
విషాదాంతాలే అంటారు!
అనంతమైన ప్రేమకు అంతం లేదు.
విషాదం అంత కన్నా లేదు.
స్మరించిన కొద్దీప్రేమ మధురం !
మధురాతి మధురం !!

Tuesday, April 17, 2012

నిజమైన ప్రేమ


ఆకర్షణతో వికసించే ప్రేమ ...
ఆచరణలో వికటిస్తుంది..!
ఆలోచనలో అంకురించే ప్రేమ...
ఆరు కాలాల పాటు నిలుస్తుంది..!

I Miss You


జగతికి సూర్యుడు లేకుంటే వేలుగు లేదు
రేయికి చంద్రుడు లేకుంటే వెన్నెల లేదు
నిను చూడకుండా ఉంటే
నా కనుపాపకు నిదుర లేదు ....

Friday, April 13, 2012

సమస్య


ఎదుటివారి సమస్య మన సమస్యగా భావించి దానికి పరిష్కారం అలోచించాలి.

Monday, April 2, 2012

తెలుసు ప్రేమంటే !


ఒకే గోడుగులో నడిచిన
మన అడుగులకు తెలుసు ప్రేమంటే !
ఒకే మెరుపు కలిసిన
మన కనులకు తెలుసు ప్రేమంటే !
కంటి సైగతో పలకరిస్తే ! బదులు పలికే
నీ చిరునవ్వు పెదవికి తెలుసు ప్రేమంటే !
మమత నిండిన నీ చేతి స్పర్శకు
స్పందించే నా మదికి తెలుసు ప్రేమంటే !
కలలు నిజమై, కలము కవితై
కలసిపోయే మన హ్రుదయమే ఫ్రేమంటే !

Monday, March 26, 2012

విజేతలు

పళ్లు ఎక్కువగా కాచే చేట్టుకే రాళ్లు రువ్వులు తప్పవు....
అలాగే విజేతలుకూ ఎన్నో ఎదురుదేబ్బలు తప్పవు....

నా కలలో.....

సంజె పొద్దులో సంపంగిలా...
ఒయ్యారాల వనరాణిలా ...
కిలకిల నవ్వుల సేలయేరు అలలులా...
నా ప్రేమ తరంగంలా...
నీ రూపమై కనిపించింది
నా కలలో.....

ఓ ప్రేమ...

గుండేల్లో దాగుండి గుర్తుండిపోయే ప్రేమ...
కల్లలో దాగుండి కనుమరుగవని ప్రేమ..
మనసులో దాగుండేది మధురమైన ప్రేమ...
నా మనసులో దాగుంది నిజమైన ప్రేమ......

నేస్తమా....


నీ కళ్ళలో కన్నీరులా జారి,
మనసులో భావంగా మారి,
నీ ఉపిరిలో శ్వాసగా చేరి,

ఫ్రాణం ఉన్నంతవరకు స్నేహితునిగా
ఉంటాను నేస్తమా....

ఆమ్మాయిలు

ఆమ్మాయిలకు ప్రేమించేటప్పుడు తల్లితండ్రులు గుర్తుకురారు
పేల్లిచేసుకునేటప్పుడు ప్రేమించినవాడు గుర్తుకురారు.

నీరీక్షణ

క్షణమొక యుగమని ఎలా అనగలను
నిను తలవక క్షణమైన లేనప్పుడు

ఫ్రేమ

నీవు నా చెంత ఉంటే మౌనం తప్ప మాటలు దరి చేరవు
నీవు దూరం అయితే నీ అలోచనలతో సమయం తేలియదు

ఫ్రేమ

రానంత సేపు రాలేదు అని భాధ
వచ్చాక విడిపొతామనే భాధ
ప్రేమంటే అంతా భాధే !

నా నేస్తం మరిచిపోకు మన స్నేహాం

కాటుక కన్నుల మాటున వెన్నెల నీ సొంతం
ఆలరించే సోయగాల వేణువు నీ స్నేహం
ముద్దులోలుకు పసిపాపను పోలును నీ వైనం
చేప్పలేని ఆలజడులను కలిగించును నీ మౌనం
సలయేరులు పరవళ్ళను తలపించును నీ హాసం
చిగురించే మన చెలిమిని మరచిపోకు నా నేస్తం

Tuesday, February 14, 2012

నా దేశం

తెలుగు భాష నా తల్లి నేర్ఫిన భాష
హిందీ భాష నా దేశం నేర్ఫిన భాష
ఇంగ్లీష్ భాష నా ప్రపంచం నేర్చుకోమన్న భాష
అని ఆనందంగా నేర్చుకున్నాను నేను
కుల, మత,జాతి, ప్రాంత, వర్ణ బేదాలుకాక
అందరం ఒక్కటే అన్న నానుడిని నమ్మాను నేను
తెలుగువాడి కీర్తి దేశ విదేశాలకు పాకిందని విని ఆనందించాను నేను
తెలుగు నేలఫై పుట్టినందుకు గర్వించాను. .....

Monday, February 13, 2012

నా చెలి

తన సుమధుర దరహాసంతో - తొలి చూపులూనే నా మది దోచిన
తన రూపం ఈ సృష్టికే ప్రతిరూపం

తన పెదవుల చిరునవ్వు - ఓ అందమైన గూలాబీ పువ్వు
నవరస భరితమైన తన - ముఖ సౌందర్యం వర్ణనాతీతం

తనే నా హృదయ రాణి - తనే నా ప్రేమ వాణి
తను లేని జీవితం నరకం - తనే నా జీవిత చరమాంకం

తను ఎన్నటికైనా వస్తుందని - నా ఆశ ఫలిస్తుందని
ప్రతి నిమిషం ఒక యుగంలా - గడుపుతున్న ఈ ప్రేమికుడిని
కరుణించవా ఇకనైనా....