Monday, June 8, 2020

మనిషి

విలువనేది తెలుసుకోలేని వాడు
ఎప్పటికీ సంపాదంచలేడు..
సంపాదించినా నిలబెట్టుకోలేడు..
కష్టపడి సాధించుకున్న వ్యక్తి
దానిని వృధా చేయలేడు..
అది స్నేహం అయినా
ప్రేమ లేదా డబ్బు
ఇలా ఏదైనా సరే..

శుభరాత్రి

ఈ రోజు జరిగిందాన్ని గుర్తు చేసుకొని
బాధపడడం, ఫిలవ్వడం కంటే..
రేపటి గురించి ఆలోచించి
ఉత్సాహం తెచ్చుకోవడం మంచిది
ఎందుకంటే ఈ రోజు జరిగిపోయింది
రేపు మన చేతుల్లో ఉంది
అందమైన రేపు కోసం
కలలు కంటూ నిద్రపో...

మంచిమాట

ఓటమి, ఒంటరితనం
ఈ రెండూ జీవితంలో
చాలా నేర్పిస్తాయి
ఒకటి ఎలా గెలవాలో నేర్పిస్తే
ఇంకొకటి ఎవరిని నమ్మాలో
ఎలా బ్రతకాలో నేర్పిస్తుంది..!

Saturday, May 16, 2020

సమయం కోసం ఎదురుచూడడం


వంద బిందెలతో
నీళ్ళు పోసినంత మాత్రాన
చెట్టు అమాంతం
కాయలు కాయదు
అలాగే మనం ఎక్కువ
కష్టపడుతున్నాం కదా అని
పనులు క్షణాల్లో పూర్తయిపోవు
దైనికైనా సమయం రావాలి
సహనం కావాలి..!!

కాలు గజేలు..!


చెలీ..!
ఎన్ని ఆశలో ఇన్నాళ్ళు
కరిగెను కన్నీరై నా కలలు
ఎంత ఆపినా నా ఊహలు
నన్ను వెంటాడుతూ నీ చూపులు
నీ నవ్వునే మోసుకొస్తూ చిరుగాలులు
నువ్వు లేకుండా
ఎలా గడుస్తాయో ఇక రోజులు
నీ జ్ఞాపకాల వానలో చివరి స్నానాలు
నీ కాలి అందెలై మిగలనీ ఇక ప్రాణాలు..!!

నిజం


నిందించడం తేలిక
నిందను భరించడం కష్టం
నీతులు వల్లించడం తేలిక
ఆచరించడం కష్టం
అబద్దం చెప్పడం తేలిక
నిజాన్ని దాచడం కష్టం

Friday, May 15, 2020

ఎవరో మహానుభావుడు చెప్పాడు


పుస్తకాలు వీధుల్లోను
చెప్పులు అద్దాల అంగడిలోనూ
అమ్మే రోజులు వచ్చిననాడు
జనం కళ్ళు తెరవడానికి
జ్ఞానం కంటే
చేప్పులే అవసరం.

గొప్ప మాట


ఊరిలో వేపచెట్టు కరువైంది
ఇంట్లో చేదు అనుభవాలు
ఎక్కువయ్యాయి
మాటలో తీపి కరువైంది
ఒంట్లో తీపి (Sugar) ఎక్కువైంది.

Monday, March 9, 2020

మనిషి

రాపిడి లేనిదే
వజ్రం ప్రకాశించదు
అలాగే కష్టాలు లేనిదే
మనిషి పరిపూర్ణత చెందడు