Friday, April 10, 2015

కాలం...


ప్రశ్నించనిదే సమాధానం దొరకాదు.
ప్రయత్నించనిదే కోరుకున్నది దొరకాదు.
అడుగు వేయ్యనిదే కాలం నిన్ను కదలనివ్వదు. 

కదలలేని నావను నేను


కడలి నిండ నీరున్న... కదలలేని నావను నేను
అడగాలని మదిలో ఉన్న... పెధవి కదపలేకున్నాను.  

నావకు తెరచపనే....    
నడిపే చిరుగాలినై..

కలలో... ఈలలో... నీకోసం కలిసిపోయాను.

Tuesday, April 7, 2015

ఆ చనిపోతున్న వ్యక్తియొక్క భావాలను ఎవరో ఇలా వ్రాసారు. . .

అమ్మా, నేనొక పార్టీకి వెళ్ళాను... నువ్వు చెప్పిన మాటను గుర్తుంచుకున్నాను.. .
నన్ను త్రాగమని అందరూ ప్రోత్సహించినా నేను మద్యం పుచ్చుకోలేదు, సోడా త్రాగాను. . .
నీ మాట విన్నందుకు మంచిగా అనిపించింది. నువ్వెప్పుడూ నా మంచి కోరే చెప్తావు. . .
నాకు తెలుసు ఇతరులు “పరవాలేదులే, త్రాగినా డ్రైవ్ చెయ్యొచ్చు అని చెప్పినా, నువ్వు చెప్పినట్లే నేను మద్యం త్రాగి డ్రైవ్ చెయ్యలేదు, పార్టీ అయిపోవచ్చింది. . .
త్రాగిన వారందరూ కార్లలో ఎక్కి డ్రైవ్ చేస్తున్నారు, నేనూ నా బండి ఎక్కి రోడ్డు మీదికి వచ్చాను. ఆ రెండో కారు నన్ను గమనించలేదు “ఢాం” అని నన్ను డీకొట్టింది, పేవ్మెంట్ మీద నేను పడి ఉన్నాను. పోలీసులు వచ్చారు ఆ రెండో డ్రైవర్ త్రాగేసి ఉన్నాడన్నారు, ఆంబులెన్స్ వచ్చింది నేను కొద్దిసేపట్లో మరణిస్తానని వారన్నారు. . .
అమ్మా.. త్రాగినది అతడు, మరణిస్తున్నది నేను... నా చుట్టూ రక్తం.. నా రక్తం,
అమ్మా, నేను త్రాగలేదు, తక్కినవాళ్ళు త్రాగారు, వాళ్ళకు సరైన ఆలోచన లేదు,
నువ్వు నాకు చెప్పినట్లుగా వాళ్ళకు ఎవ్వరూ హితం చెప్పలేదా?
చెప్పి ఉండి ఉంటే నాకీ భయంకర అకాల మరణం తప్పేదిగా. . .
నేను భరించలేని నొప్పి, బాధ, యమయాతన అనుభవిస్తున్నాను. . .
నన్ను కొట్టినవాడు ఊరికే నిలబడి చూస్తూ ఉన్నాడు,
నేను చచ్చిపోతూ ఉంటే అతడు నడుస్తున్నాడు. . .
అమ్మా ఇదేమి న్యాయం? నాకు సమాధానం చెప్పమ్మా. . .
నాకు భయం వేస్తోంది, నా ఊపిరి ఆగిపోతున్నది. . .
నా కోసం నువ్వు ఏడవకమ్మా. . .
దీనిని మీకు తెలిసినవారందరికీ పంచండి. . .
మనుష్యులలో ఇది మార్పు తేవాలి. . .
త్రాగేసి డ్రైవ్ చెయ్యకూడదనే ఇంగితజ్ఞానం అందరికీ రావాలి. . .
ప్లీజ్ షేర్ చెయండి ఫ్రెండ్స్. . . . . .

Wednesday, February 11, 2015

అమ్మ..


ఎన్ని యుగాలు మారిన ఎన్ని తరాలు దాటినా మారని మాదుర్యం అమ్మ ప్రేమ
కనులు తెరిచిన క్షణం , కనపడే రూపం అమ్మ
తన ఆత్మ శరీరం పంచి మనకు జన్మ నిచ్చిన దివ్యరూపం

అమ్మ..

Tuesday, February 10, 2015

భార్య - భర్తల అనుబంధం

ఒక భర్త తన భార్యకు ఇలా S M S చేశాడు:
నా జీవితాన్ని ఆధ్బుతంగా తీర్చిదిద్దినందుకు, నా జీవితంలో ఒక భాగమైనందుకు నీకు కృతజ్ఞతలు,
ఇప్పుడు నేనీస్థితిలొ ఉన్నానంటే దానికి నువ్వేకారణం.
నువ్వే నా దేవతవి...!
నువ్వు నా జీవితంలో వచ్చినందుకు చాలా చాలా థాంక్సు.
నువ్వు చాలా గొప్పదానివి.

భర్త పంపిన S M S చదివి, భార్య ఇలా జవాబు ఇచ్చింది.
తాగడం అయ్యిందా...!
ఇంకా S M S లు ఆపు,
నోరు మూసుకుని ఇంటికి రా...!
భయపడకు... నేను నిన్ను ఎమీ అనను.
త్వరగా ఇంటికి రా..!

ఇది చదివిన భర్త:
థాంక్సు..!
నేను ఇంటి బయటే ఉన్నాను.
దయచేసి తలుపు తేరువు...!

Tuesday, January 13, 2015

జ్ఞాపకం...


పెంచుకుంటే పెరిగేది
మమత ఒక్కటే...
పంచుకుంటే తరిగేది
భాధ ఒక్కటే...




పెంచుకున్నా, పంచుకున్నా మిగిలేది
జ్ఞాపకం ఒక్కటే...

Saturday, July 5, 2014

నీ జ్ఞాపకం చెరపటం నా వల్ల కాదు...


నా వల్ల కాదు
నీ జ్ఞాపకం చెరపటం నా వల్ల కాదు
నిను మరవడానికి చేసే ప్రతి ప్రయత్నం లో
మరో జ్ఞాపకమైపొతున్నావు
దూరమవుతున్నాననుకుంటూ
మరింత దగ్గరైపోతున్నాను.
జ్ఞాపకాలు చెరిపేస్తున్నాననుకుంటూ
ప్రతి ఆలోచనలో నిను పొందుపరిచేస్తున్నాను
ఇప్పటికి అర్దమయింది
నేను వదులుకుందామనుకుంటుంది
నీ జ్ఞాపకాన్నే గానీ
నిన్ను కాదు అని......!!