Thursday, June 12, 2014

ప్రేమ జ్యోతులు వెలిగిస్తావనుకున్నాను...

నా హృదయాన్ని మమతానురాగాల కోవెల చేసి,
ప్రేమ జ్యోతులు వెలిగిస్తావనుకున్నాను...

కానీ...!

మమతాను రాగాలను మసి చేసి,
ప్రాణం లేని జీవచ్చవాలు కలియతిరిగే
స్మశాన వాటికను చేసి చితి మంటలను రగిలిస్తావని, కలలోనైనా కలగనలేదు..

నిజ౦ చెప్పి౦ది....

నన్ను చేరువయ్యే మరణ౦ చేదు నిజ౦
చెప్పి౦ది
మరుజన్మలోనైన మగువ మాయలో
పడకు అని..

Sunday, June 8, 2014

ఏ మందు మాన్పగలదు..!

నువ్వు మిగిల్చిన జ్ఞాపకాలు,
ఒక్కో ముల్లై గుండెను గుచ్చి గాయం చేస్తుంటే...!
నా మనసు పడే నరకయాతనను ఏ మందు మాన్పగలదు..!
నీ ప్రేమ తప్ప...

Sunday, March 23, 2014

ప్రేమ....

ప్రేమ పుట్టేది క్షణ కాలం....
కాని
నిలుపుకోవాల్సింది మాత్రం జీవిత కాలం...    

వృధాశ్రమం లో ఉన్న ఒక ఆమ్మ ప్రశ్న...??

" నిన్ను తొమ్మిది నెలలు
కడుపు లో పెట్టుకుని మోసిన
నాకు ఉండటానికి కొంచం   
స్థలం లేదా నీ ఇంటిలో ?"       

మరణం...

నేను వెళుతున్నానుని భాధపడకు
చావు నా దేహానికేగాని.....
నీ మనసులో ఉన్న నా ప్రేమకు మరణం లేదు..! 

మనిషిగా...

ఎదుటివారి కన్నీరు చూసి
నువ్వు ఆనందించాలి
అనుకుంటే,
ఆ క్షణమే నువ్వు మనిషిగా
మరణించినట్టు లెక్క...