Thursday, December 2, 2021

నా హృదయం పగిలే నిజం...

 

వికసించే పుష్పంలో పరిశీలంచాను.

నీనవ్వు దాగుందని..

 

వసంత కోకిల కోసం వెతికాను

కమ్మని నీ గానం విందామని...

 

రాని నిద్రకోసం పరితపించాను

కలలో నీ రూపం చూద్దామని...

 

వీచే గాలిని ప్రశ్నించాను

నీ ప్రేమ వర్తమానం పంపోచ్చని...

 

చివరగా నీ మనస్సు నడిగానూ...

 

అప్పుడే తెలిసినది నా హృదయం పగిలే నిజం

నీ హృదయంలో  నాకు చోటు లేదని...

Friday, November 5, 2021

జీవితం

 పుట్టేటప్పుడు ఎదో సాధించాలని,

పిడికిలి బిగించి మరీ  ప్రాణం పోసుకుంటాం,

పోయేటప్పుడు సాధించింది ఏమి కూడా,

తీసుకుపోలేదు అని అరచేతిని ఆకాశానికి,

చూపించి ప్రాణాలు వదిలేస్తాం..

జీవితంలో ఏది శాశ్వతం కాదు,

నీ సంపద, కీర్తి, బంధాలు, చివరికి నీ శరీరం కూడా,

ఒక్క నీవు చేసిన మంచి తప్ప...!!!

Thursday, September 2, 2021

నవ్వడమే జీవితం

 తొలిశ్వాస తీసుకుని ఏడుస్తావ్..

తుదిశ్వాస విడుస్తూ ఏడిపిస్తావ్..

ఈ రెండు ఏడుపుల మధ్య..

నువ్వు నవ్వుతూ జీవించే కాలమే నీ జీవితం.

కష్టాలు-కన్నీళ్ళు, భావోద్వేగాలు-బాధలు అందరికి ఉంటాయి.

చిరునవ్వుతో వాటికి ఎదురెళ్ళు, జీవితాన్ని ఆస్వాదించు.

Monday, June 8, 2020

మనిషి

విలువనేది తెలుసుకోలేని వాడు
ఎప్పటికీ సంపాదంచలేడు..
సంపాదించినా నిలబెట్టుకోలేడు..
కష్టపడి సాధించుకున్న వ్యక్తి
దానిని వృధా చేయలేడు..
అది స్నేహం అయినా
ప్రేమ లేదా డబ్బు
ఇలా ఏదైనా సరే..

శుభరాత్రి

ఈ రోజు జరిగిందాన్ని గుర్తు చేసుకొని
బాధపడడం, ఫిలవ్వడం కంటే..
రేపటి గురించి ఆలోచించి
ఉత్సాహం తెచ్చుకోవడం మంచిది
ఎందుకంటే ఈ రోజు జరిగిపోయింది
రేపు మన చేతుల్లో ఉంది
అందమైన రేపు కోసం
కలలు కంటూ నిద్రపో...

మంచిమాట

ఓటమి, ఒంటరితనం
ఈ రెండూ జీవితంలో
చాలా నేర్పిస్తాయి
ఒకటి ఎలా గెలవాలో నేర్పిస్తే
ఇంకొకటి ఎవరిని నమ్మాలో
ఎలా బ్రతకాలో నేర్పిస్తుంది..!

Saturday, May 16, 2020

సమయం కోసం ఎదురుచూడడం


వంద బిందెలతో
నీళ్ళు పోసినంత మాత్రాన
చెట్టు అమాంతం
కాయలు కాయదు
అలాగే మనం ఎక్కువ
కష్టపడుతున్నాం కదా అని
పనులు క్షణాల్లో పూర్తయిపోవు
దైనికైనా సమయం రావాలి
సహనం కావాలి..!!

కాలు గజేలు..!


చెలీ..!
ఎన్ని ఆశలో ఇన్నాళ్ళు
కరిగెను కన్నీరై నా కలలు
ఎంత ఆపినా నా ఊహలు
నన్ను వెంటాడుతూ నీ చూపులు
నీ నవ్వునే మోసుకొస్తూ చిరుగాలులు
నువ్వు లేకుండా
ఎలా గడుస్తాయో ఇక రోజులు
నీ జ్ఞాపకాల వానలో చివరి స్నానాలు
నీ కాలి అందెలై మిగలనీ ఇక ప్రాణాలు..!!

నిజం


నిందించడం తేలిక
నిందను భరించడం కష్టం
నీతులు వల్లించడం తేలిక
ఆచరించడం కష్టం
అబద్దం చెప్పడం తేలిక
నిజాన్ని దాచడం కష్టం

Friday, May 15, 2020

ఎవరో మహానుభావుడు చెప్పాడు


పుస్తకాలు వీధుల్లోను
చెప్పులు అద్దాల అంగడిలోనూ
అమ్మే రోజులు వచ్చిననాడు
జనం కళ్ళు తెరవడానికి
జ్ఞానం కంటే
చేప్పులే అవసరం.

గొప్ప మాట


ఊరిలో వేపచెట్టు కరువైంది
ఇంట్లో చేదు అనుభవాలు
ఎక్కువయ్యాయి
మాటలో తీపి కరువైంది
ఒంట్లో తీపి (Sugar) ఎక్కువైంది.

Monday, March 9, 2020

మనిషి

రాపిడి లేనిదే
వజ్రం ప్రకాశించదు
అలాగే కష్టాలు లేనిదే
మనిషి పరిపూర్ణత చెందడు

Friday, December 27, 2019

జీవిత పాఠం..!

భయపడుతూ కూర్చుంటే
బతకలేవు
తప్పో, ఒప్పో అడుగు వేసి చూడు
గెలుపైతే - నిన్ను ముందుకు నడిపిస్తుంది.
ఓటమి పాలైతే - తర్వాత ఏం చేయాలో నేర్పిస్తుంది.

మట్టి..!

మట్టిని నమ్ముకుని
మట్టిలో కలసిపోయేవాడు ఒకడు.

మట్టిని అమ్ముకుని మేడ్లల్లో బతుకేవాడు ఇంకొకడు.

రెచ్చగోట్టకు..!!!

'రేపు' అనే నీ రాత ఏమిటో
తెలియనప్పుడు
'నేడు' అనే నీ సంతోషాన్ని
వదులుకోకు..!
గతాన్ని మరల తవ్వి నీ బాధని రెచ్చగోట్టకు..!

ఈ జీవితం

అదుపు తప్పి కిందపడితే
ఆదుకోదు ఈ లోకం.

అలసిపోయి కన్నుమూస్తే
బ్రతికించ లేదు ఏ బంధం.

దారిలోన చీకటైతే
తోడు రాదు నీ నీడ.

జారిపోయి దూరమైతే
చేరుకోదు నీ ప్రేమ.

అందుకే నిన్నే నమ్ముకో...
నువ్వయి సాగిపో...

నా ప్రియ నేస్తమా..! జాగ్రత్త సుమా..!

అద్భుతం

అవసరం అద్భుతాన్ని సృష్టిస్తుంది.

అంచనా...

ఒక మనిషిని అంచనా వేయాలంటే చూడాల్సింది వాడి ఆరంభాన్ని కాదు... ముగింపుని

శుభరాత్రి

రాత్రనేది కలలు కనే సమయం
కలత చెందాల్సిన సమయం కాదు
బాధైనా, బాధ్యతలైనా ప్రొద్దున్నే చూసుకోవచ్చు... హాయిగా నిదురపో...

మంచిమాట: విజయానికి పునాది.

ధీరుడు ఎప్పుడూ  తనకు కావలసినది స్వయంగా పోరాడి సాధించుకుంటాడు

ఒకరి నుండి అక్రమంగా  తీసుకోవాలనుకోడు.. ఏదీ ఉచితంగా అశించడు..
అతని పోరాటతత్వమే విజయానికి పునాది.